2022-23లో రెండున్నర రెట్లు పెరిగిన ఈవీ టూ-వీలర్ అమ్మకాలు!

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాల అమ్మకాలు రెండున్నర రెట్లు పెరిగాయని పరిశ్రమ సంఘం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,46,976 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Update: 2023-04-10 16:44 GMT

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాల అమ్మకాలు రెండున్నర రెట్లు పెరిగాయని పరిశ్రమ సంఘం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,46,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు 2021-22లో మొత్తం 3,27,900 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) విక్రయించబడ్డాయని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్(ఎస్ఎంఈవీ) సోమవారం ప్రకటనలో పేర్కొంది.

గత ఆర్థిక సంవత్సరంలో గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ స్పీడ్‌తో ప్రయాణించే ఈ-స్కూటర్లు 1.20 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు మించి ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈవీ వాహనాలు 7.27 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయని ఎస్ఎంఈవీ వివరించింది. అయితే, ఈ వృద్ధి వివిధ ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు అంచనా వేసిన దానికంటే తక్కువగానే ఉంది. కొన్ని కంపెనీలు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేమ్ 2 పథకం రాయితీల నుంచి వైదొలగడం అమ్మకాలపై ప్రభావం చూపినట్టు ఎస్ఎంఈవీ వెల్లడించింది.

Tags:    

Similar News