పండగ టైంలో షాకింగ్ న్యూస్: పెరిగిన సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు

దేశ రాజధానిలో సీఎన్‌జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలు రూ. 3 చొప్పున ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) పెంచింది..Latest Telugu News

Update: 2022-10-08 13:14 GMT

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సీఎన్‌జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) ధరలు రూ. 3 చొప్పున ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) పెంచింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు మరికొన్ని నగరాల్లో కూడా ఈ ధరల పెంపు వర్తిస్తుందని తెలిపింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో CNG ధర రూ. 78.61గా ఉంది. ఇంతకుముందు ఇది కిలోకు రూ. 75.61 గా ఉండేది. PTI డేటా ప్రకారం ఏప్రిల్ 2021 నుంచి CNG ధరలు 80 శాతం పెరిగాయి.

అదేవిధంగా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ప్రకారం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)( గృహాల వంటశాలలకు పైప్ చేయబడిన గ్యాస్) రేట్లు ఢిల్లీలో ఒక స్టాండర్డ్ క్యూబిక్ మీటరుకు రూ. 50.59 నుంచి రూ. 53.59కి పెంచారు. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, రాజస్థాన్‌లోని అజ్మీర్ వంటి ఇతర నగరాల్లో కూడా CNG, PNG రేట్లు పెంచినట్లు IGL తెలిపింది.

2-19 శాతం తగ్గనున్న సబ్బులు, డిటర్జెంట్‌ల ధరలు 


Similar News