నాణ్యతా ప్రమాణాలు లేని కుక్కర్లు అమ్మినందుకు ఫ్లిప్‌కార్ట్‌కు రూ. లక్ష జరిమానా!
న్యూఢిల్లీ: నాణ్యతా ప్రమాణాలు లేని ప్రెషర్ కుక్కర్లను విక్రయించిన కారణంగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: నాణ్యతా ప్రమాణాలు లేని ప్రెషర్ కుక్కర్లను విక్రయించిన కారణంగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్ విక్రయించిన మొత్తం 598 ప్రెషర్ కుక్కర్లలో నాణ్యతా ప్రమాణాలు లేవని విచారణలో తేలింది. వీటి విక్రయాల ద్వారా ఫ్లిప్‌కార్ట్‌కు కమీషన్ రుసుము రూపంలో రూ. 1,84,263 వచ్చాయని సీసీపీఏ పేర్కొంది.
వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ కంపెనీ 45 రోజుల్లోగా నివేదికను సమర్పించడంతో పాటు విక్రయించిన ప్రెషర్ కుక్కర్లను వెనక్కి తీసుకుని, కొనుగోలు చేసిన వినియోగదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని సీసీపీఏ ఆదేశించింది. నాణ్యతా ప్రమాణాలు లేని కారణంగా ఈ నెల ప్రారంభంలో సైతం సీసీపీఏ మరో ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్‌పై రూ. లక్ష జరిమానా విధించింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని 2,265 ప్రెషర్ కుక్కర్లను విక్రయించడం వల్ల ఈ జరిమానా విధిచబడింది.