భారత్‌లో లాజిస్టిక్ యూనిట్ ఏర్పాటు చేసే యోచనలో బోయింగ్!

గ్లోబల్ దిగ్గజ విమానాల తయారీ సంస్థ బోయింగ్ దేశీయంగా విడిభాగాల లాజిస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

Update: 2023-02-13 16:00 GMT

బెంగళూరు: గ్లోబల్ దిగ్గజ విమానాల తయారీ సంస్థ బోయింగ్ దేశీయంగా విడిభాగాల లాజిస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం కంపెనీ సుమారు రూ. 200 కోట్ల(24 మిలియన్ డాలర్ల)ను పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు బోయింగ్ ఇండియా విభాగం అధ్యక్షుడు సలీల్ గుప్తా అన్నారు. ఇటీవల దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దాదాపు 500 విమానాలను కొనేందుకు ఒప్పందం ఖరారు కానున్న తరుణంలో బోయింగ్ స్థానిక లాజిస్టిక్ యూనిట్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.

ఎయిర్ఇండియా బోయింగ్‌తో పాటు ఎయిర్‌బస్ కంపెనీల నుంచి 500 వరకు విమానాలను కొననున్నది. వీటి విలువ దాదాపు రూ. 8.3 లక్షల కోట్లకు పైన ఉండొచ్చని అంచనా. అందులో బోయింగ్ నుంచి 737 మ్యాక్స్ విమానాలు 190, 787 వైడ్ బాడీ విమానాలు 20, 777 ఎక్స్ విమానాలు 10 ఉండనున్నట్టు సమాచారం. అయితే, ఎయిర్ ఇండియా ఆర్డర్ల వివరాల గురించి స్పందించేందుకు సలీల్ గుప్తె నిరాకరించారు. పౌర విమానయాన మార్కెట్‌కు సంబంధించి భారత్ కీలకమైనదిగా భావిస్తున్నాం. నారో బాడీ, వైడ్ బాడీ విమానాలకు గిరాకీ ఉంటుంది. కాబట్టి విమానయాన సంస్థలకు విమానాలు, మెయింటెనెన్స్, విమాన సర్వీసుల కోసం భారత్‌లో లాజిస్టిక్ యూనిట్ ఏర్పాటు అవసరమని సలీల్ గుప్తె తెలిపారు.

Tags:    

Similar News