BMW గుడ్ న్యూస్.. ఈఏడాదిలో మార్కెట్‌లోకి 22 కొత్త మోడల్ కార్లు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దేశీయ మార్కెట్లో ఈ ఏడాది 19 కొత్త కార్లను తీసుకురానున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది స్థాయిలోనే 2023లో సైతం రెండంకెల
న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దేశీయ మార్కెట్లో ఈ ఏడాది 19 కొత్త కార్లను తీసుకురానున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది స్థాయిలోనే 2023లో సైతం రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కొత్తగా విడుదల చేయబోయే కార్లలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) కూడా ఉంటాయని బీఎండబ్ల్యూ గ్రూ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా అన్నారు.
భారత్‌లో ఇప్పటివరకు తమకు 2023 ఏడాది అత్యుత్తమంగా ఉంటుందని, మొత్తం అమ్మకాల్లో 15 శాతం వాటా ఈవీలదే ఉండాలని భావిస్తున్నాం. ద్విచక్ర వాహనాల విభాగంలో కూడా ఈ ఏడాది కొత్తగా మూడు బీఎండబ్ల్యూ మోటోరాడ్ బైకులను తీసుకొస్తాం. గత కొన్నేళ్ల నుంచి తాము ఏటా ఇరవైకి పైగా ఉత్పత్తులను విడుదల చేస్తున్నాం. మొత్తం పోర్ట్‌ఫోన్లియోలో మూడింట రెండు వంతులు కొత్త లేదా రీఫ్రెష్ మోడళ్లు ఉంటాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య కంపెనీ ఏకంగా ఎనిమిది మోడళ్లను తీసుకొచ్చింది. 5,500 కార్లు, 4,500 బైకుల ఆర్డర్లతో వినియోగదారుల నుంచి గణనీయమైన డిమాండ్‌ను చూస్తున్నామని విక్రమ్ వివరించారు.