టెలికాం శాఖకు రూ. 8,325 కోట్ల స్పెక్ట్రమ్ బకాయి చెల్లించిన ఎయిర్‌టెల్
2015 నాటి స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి 10 శాతం వడ్డీతో సహా కొంత మొత్తం బకాయిలను చెల్లించేసినట్లు కంపెనీ పేర్కొంది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ భారీ మొత్తంలో స్పెక్ట్రమ్ బకాయిని చెల్లించింది. మంగళవారం టెలికాం శాఖకు రూ. 8,325 కోట్ల ముందస్తు చెల్లింపులను ఎయిర్‌టెల్ పూర్తి చేసింది. 2015 నాటి వేలంలో పొందిన స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి 10 శాతం వడ్డీతో సహా బకాయిలను చెల్లించేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ఎయిర్‌టెల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. 2015, మార్చిలో జరిగిన వేలంలో ఎయిర్‌టెల్ రూ. 29,129.08 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది. అందులో రూ. 11,374.7 కోట్లు చెల్లించగా, ముందస్తుగా చెల్లించాల్సిన మొత్తం రూ. 7,832.20 కోట్లు బకాయి పడింది. స్పెక్ట్రమ్ బకాయి చెల్లింపుల నేపథ్యంలో మంగళవారం భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 2.97 శాతం పెరిగి రూ. 1,157.10 వద్ద ముగిసింది.