Apple: ఇండియాలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనున్న యాపిల్..!

ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ(Tech Giant company) యాపిల్(Apple) భారత్(India)లో త్వరలోనే మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్ల(Retail stores)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Update: 2024-10-04 11:26 GMT

దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ(Tech Giant company) యాపిల్(Apple) భారత్(India)లో త్వరలోనే మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్ల(Retail stores)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.కాగా ఇండియాలో ఆ సంస్థకు ఇప్పటికే ముంబై,ఢిల్లీలో స్టోర్లు ఉన్నాయి. ఈ స్టోర్లకు మంచి ఆదరణ లభిస్తోంది.ఈ నేపథ్యంలో మరో నాలుగు రిటైల్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.ఈ మేరకు యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓ'బ్రియన్(Deirdre O'Brien) ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ స్టోర్లను బెంగళూరు,పూణే,ఢిల్లీ-ఎన్సీఆర్,ముంబైలో ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు.ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల(iPhone 16 series Phones) ఉత్పత్తిని ఇండియాలో తయారు చేస్తున్నట్లు యాపిల్ వెల్లడించింది. వీటిని ప్రపంచలోని మిగత దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. కాగా యాపిల్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 500 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. భారత్‌లో విస్తరణకు మంచి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే యాపిల్ కంపెనీ ఇక్కడి మార్కెట్‌పై దృష్టి సారించింది.ఐఫోన్ అమ్మకాలు కూడా భారీగా పుంజుకుంటున్న సమయంలో స్టోర్లను ప్రారంభించడం వల్ల కస్టమర్లను మరింత ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. 


Similar News