నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ద వాతావరణం వలన శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి.

Update: 2024-10-04 05:13 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ద వాతావరణం వలన శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాలలో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్ మొదలైన కొద్ది సేపు ఫ్లాట్ గా ఉన్న సూచీలు.. తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 288 పాయింట్లు కోల్పోయి 82,122 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 128.25 పాయింట్లు నష్టపోయి 25,185 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.96 వద్ద ప్రారంభమయింది. ఇక అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77 డాలర్ల పైన ట్రేడ్ అవుతుండగా.. బంగారం ఔన్సు 2,682.30 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 


Similar News