మరికొద్ది రోజుల పాటు తక్కువ విమానాలు నడపనున్న ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్
'మాస్ లీవ్'సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం కనిపించకపోవడంతో ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ ఉద్యోగులకు లేఖ రాశారు
దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూపునకు చెందిన 90కి పైగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దయ్యాయి. ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బంది అనూహ్యంగా అనారోగ్య కారణంతో సెలవు పెట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కంపెనీ ఎదుర్కొంటున్న 'మాస్ లీవ్' సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం కనిపించకపోవడంతో ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ ఉద్యోగులకు లేఖ రాశారు. రాబోయే కొద్ది రోజుల పాటు తక్కువ విమానాలను నడపనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 7న రాత్రి నుంచి 300 మంది సీనియర్ కేబిన్ సిబ్బంది చివరి నిమిషంలో అస్వస్థకు గురై తమ సెల్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయడంతో కంపెనీ 90కి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీనివల్ల వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సైతం మేనేజ్‌మెంట్‌కు లేఖ రాసింది. నెట్‌వర్క్ అంతటా అంతరాయాం ఏర్పడింది. మరికొన్ని రోజులు షెడ్యూల్‌ను తగ్గించాల్సి వచ్చింది. సిబ్బంది అందుబాటులో లేకపోవడం, షెడ్యూల్ పునరుద్ధరణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని అలోక్ సింగ్ లేఖలో పేర్కొన్నారు.