Airtel నుంచి ఉచితంగా 5G డేటా.. ఇలా యాక్టివేట్ చేయండి!

దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌లో దూసుకుపోతుంది.

Update: 2023-03-19 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో 5G సేవలు అందిస్తుండగా, ఇటీవల ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 5G ప్రయోజనాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఆఫర్ ప్రకారం, రూ. 239 ప్లాన్, అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో ఉన్న ప్రీపెయిడ్ కస్టమర్‌లందరూ ఈ ఆఫర్‌ను పొందవచ్చు. పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు అలాంటి పరిమితి లేదు. కానీ రూ. 455, రూ. 1799 ప్లాన్‌లను కలిగి ఉన్న ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందలేరు. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌‌లో యూజర్లకు ఈ ఆఫర్ గురించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. యాప్‌లో ‘క్లెయిమ్ అన్‌లిమిటెడ్ 5G డేటా బ్యానర్’ పై క్లిక్ చేసి ఈ ఆఫర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిని నిర్ధారించడానికి SMS కూడా అందుకుంటారు. ఈ ఆఫర్‌ 5G హ్యాండ్‌సెట్‌లు, 5G కనెక్టివిటీ ఉన్న ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.

Tags:    

Similar News