పదేళ్లకోసారి Aadhaar అప్‌డేషన్ తప్పనిసరి..
ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన పత్రాలు సమర్పించి అందులో పొందుపరిచిన వివరాలను అప్ డేట్ చేసుకోవాలని భారత విశిష్ట ప్రాధికార సంస్థ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్: ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన పత్రాలు సమర్పించి అందులో పొందుపరిచిన వివరాలను అప్ డేట్ చేసుకోవాలని భారత విశిష్ట ప్రాధికార సంస్థ గురువారం గైడ్ లైన్స్ జారీ చేసింది. దీని ప్రకారం కనీసం ప్రతి ఒక్కరూ పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి లోని వివరాలను అప్ డేట్ చేయాలని పేర్కొంది. ఈ సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చితమైన సమాచారం నిక్షిప్తమవడానికి దోహం చేస్తుందని తెలిపింది. మై ఆధార్ పోర్టల్ లేదా దగ్గరలోని ఆధార్ కేంద్రం నుంచి ఆధార్ అప్ డేట్ ప్రక్రియను పూర్తి చేయవచ్చని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆధార్ రెగ్యులేషన్స్ 2016లో కొత్తగా 16ఎ నిబంధనను చేరుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read more :
1.అదిరిపోయే శుభవార్త.. రూ. 339 చెల్లిస్తే..10 లక్షల బీమా
2.Post Office Schemes: 14లక్షలు మీ సొంతం.. ఆ పథకంలో మీరు ఉన్నారా.?