ఇక మీదట సురక్షితంగా ఆధార్‌ కార్డు.. రెండంచెల సెక్యూరిటీ ఫీచర్ రెడీ!

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని వేగవంతం చేయడానికి, అలాగే ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచడానికి కొత్త సెక్యూరిటీ విధానాన్ని రూపొందించింది

Update: 2023-02-28 16:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానాన్ని వేగవంతం చేయడానికి, అలాగే ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచడానికి కొత్త సెక్యూరిటీ విధానాన్ని రూపొందించింది. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (AI, ML) ఆధారిత సెక్యూరిటీ మెకానిజంను అభివృద్ధి చేశారు. ఇది కొత్త టూ-ఫాక్టర్/లేయర్ సెక్యూరిటీ. ఆధార్ వెరిఫికేషన్‌ను రెండు దశల్లో చేస్తుంది. దీని ద్వారా నకిలీ ఆధార్ కార్డులను చెక్ పెట్టడమే కాకుండా వేలిముద్ర క్యాప్చర్ వేగవంతంగా, అత్యంత కచ్చితత్వంతో చెక్ చేయడానికి, ఆధార్ ప్రామాణీకరణను మరింత పటిష్టంగా, సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, టెలికాం, ప్రభుత్వ రంగాలతో సహా ఇతర అవసరాల్లో నకిలీ ఆధార్ కార్డుల బెడద తప్పనుంది. అలాగే, ఆధార్‌ను సురక్షితంగా ఉంచుతుంది.

Tags:    

Similar News