కిడ్నాప్ ముఠా అరెస్టు
ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సూరపనేని రమేష్‌ను పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆది అనే వ్యక్తి మరికొందరితో కలిసి కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అయితే ప్లాన్ కాస్త పోలీసులకు లీక్ అవడంతో వెంటనే వారు కిడ్నాప్ ముఠాను చాకచాక్యంగా పట్టుకున్నారు. ఆదిపై గతంలో 6కేసులు ఉన్నట్టు […]
ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సూరపనేని రమేష్‌ను పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆది అనే వ్యక్తి మరికొందరితో కలిసి కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అయితే ప్లాన్ కాస్త పోలీసులకు లీక్ అవడంతో వెంటనే వారు కిడ్నాప్ ముఠాను చాకచాక్యంగా పట్టుకున్నారు. ఆదిపై గతంలో 6కేసులు ఉన్నట్టు తేలింది. కియా పరిశ్రమ వద్ద పలువురికి చెందిన భూములను ఇతడు ఆక్రమించకున్నాడు. కాగా, నిందితుల నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.
tags ; kidnap, kurnool, aadi and his team, weapons handover, land grabbing cases