వినియోగ వృద్ధిని ఆశిస్తున్న ఎఫ్ఎంసీజీ పరిశ్రమ

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వ్యవసాయ రుణాల విస్తరణ, ఉద్యోగాల కల్పనపై బడ్జెట్‌లో దృష్టి పెట్టడంతో వినియోగ వృద్ధి మెరుగయ్యే అవకాశాలున్నాయని ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన పరిశ్రమ వర్గాలు కరోనా సంక్షోభం నుంచి రికవరీ సంకేతాలను బడ్జెట్ ప్రకటనలు చూపిస్తున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా నిరంతర పెట్టుబడులు ఉంటాయని, స్టార్టప్‌లకు సహాయపడే ప్రకటన వల్ల స్థానిక ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యత ఏర్పడుతుందని ఎఫ్ఎంసీజీ దిగ్గజం పెప్సీకో […]

Update: 2021-02-02 09:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వ్యవసాయ రుణాల విస్తరణ, ఉద్యోగాల కల్పనపై బడ్జెట్‌లో దృష్టి పెట్టడంతో వినియోగ వృద్ధి మెరుగయ్యే అవకాశాలున్నాయని ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన పరిశ్రమ వర్గాలు కరోనా సంక్షోభం నుంచి రికవరీ సంకేతాలను బడ్జెట్ ప్రకటనలు చూపిస్తున్నాయని తెలిపారు.

మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా నిరంతర పెట్టుబడులు ఉంటాయని, స్టార్టప్‌లకు సహాయపడే ప్రకటన వల్ల స్థానిక ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యత ఏర్పడుతుందని ఎఫ్ఎంసీజీ దిగ్గజం పెప్సీకో అధ్యక్షుడు అహ్మద్ చెప్పారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కేటాయింపు వల్ల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందనే భరోసా ఉందని డాబర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మోహిత్ మల్హోత్రా తెలిపారు.

Tags:    

Similar News