విజయసాయిరెడ్డిని తరిమికొట్టాలి: బుద్ధా వెంకన్న
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తనకు తెలియదని.. ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాయడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డి హయాంలోనే పోస్కోతో ఒప్పందం జరిగినట్టు కేంద్ర మంత్రి చెప్పారని.. స్టీ్ల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తనకు తెలియదని చెబుతున్న విజయసాయిరెడ్డిని విశాఖ ప్రజలు తరిమికొట్టాలని బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ దోపిడీలు చేస్తోందని […]
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తనకు తెలియదని.. ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాయడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డి హయాంలోనే పోస్కోతో ఒప్పందం జరిగినట్టు కేంద్ర మంత్రి చెప్పారని.. స్టీ్ల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తనకు తెలియదని చెబుతున్న విజయసాయిరెడ్డిని విశాఖ ప్రజలు తరిమికొట్టాలని బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ దోపిడీలు చేస్తోందని బుద్ధా వెంకన్న ఆరోపించారు.