మనోహర్ పంతులు జీవితం ఆదర్శనీయం : ప్రియదర్శిని
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సాతంత్ర్య సమర యోధుడు వేమవరం మనోహర్ పంతులు గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా, ప్రముఖులు సందర్శించి, నివాళులర్పిస్తున్నారు. తాజాగా.. బహుజన సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడి ప్రియదర్శిని మనోహర్ పంతులు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి […]
దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సాతంత్ర్య సమర యోధుడు వేమవరం మనోహర్ పంతులు గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా, ప్రముఖులు సందర్శించి, నివాళులర్పిస్తున్నారు.
తాజాగా.. బహుజన సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడి ప్రియదర్శిని మనోహర్ పంతులు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడు మనోహర్ పంతులు జీవితం అందరికీ ఆదర్శం అని అన్నారు. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.