రాజస్థాన్‌లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి : మాయావతి
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ బాహాటంగా పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని అతిక్రమించారని, రెండో సారి తమ పార్టీ ఎమ్మెల్యేలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. నాడు తమ పార్టీ నేతలను కాంగ్రెస్‌లో చేరేలా ప్రోత్సహించలేదా అని ప్రశ్నించారు. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రపతి పాలనకు […]
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ బాహాటంగా పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని అతిక్రమించారని, రెండో సారి తమ పార్టీ ఎమ్మెల్యేలను మోసం చేశారని ఆమె ఆరోపించారు. నాడు తమ పార్టీ నేతలను కాంగ్రెస్‌లో చేరేలా ప్రోత్సహించలేదా అని ప్రశ్నించారు. రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కి పాల్పడటం ద్వారా అశోక్ గెహ్లాట్ రాజ్యాంగ విరుద్ధ పోకడలకు పోయారని, ఇది నేరం కింద పరిగణించాలని మాయావతి కోరారు.
అటు-రాజస్థాన్ మాజీ మంత్రి రమేష్ మీనా కూడా సీఎం అశోక్ గెహ్లాట్‌ను తూర్పారబట్టారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఎస్పీ ఎమ్మెల్యేలకు ఎంత సొమ్ము ముట్టజెప్పారని ఆయన కూడా ప్రశ్నించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సచిన్ పైలట్ ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడ్డారని, బీజేపీతో చేతులు కలుపుతున్నారని గెహ్లాట్ చేసిన ఆరోపణల పై రమేష్ మీనా ప్రస్తావిస్తూ.. మరి మీరు నాడు చేసిందేమిటని విమర్శించారు.