విరిగిపడిన విద్యుత్ స్తంభం.. తప్పిన పెను ప్రమాదం

దిశ, జడ్చర్ల : వారం రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో గల దేవి థియేటర్ వెనకాల భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయి రోడ్డు పై పడింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా అయ్యే సమయంలో విద్యుత్ స్తంభం నేలకొరిగి ఉంటే ప్రమాదంతో పాటు ప్రాణనష్టం జరిగి ఉండేదని, విద్యుత్ […]

Update: 2021-07-22 07:28 GMT

దిశ, జడ్చర్ల : వారం రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో గల దేవి థియేటర్ వెనకాల భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో చెట్టు కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయి రోడ్డు పై పడింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా అయ్యే సమయంలో విద్యుత్ స్తంభం నేలకొరిగి ఉంటే ప్రమాదంతో పాటు ప్రాణనష్టం జరిగి ఉండేదని, విద్యుత్ సరఫరా లేకపోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక మూడో వార్డు కౌన్సిలర్ సతీష్ సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపేసి విరిగిన స్తంభం వద్ద మరమ్మతులు చేపట్టారు. నూతన విద్యుత్ తీగలు బిగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించిన స్థానిక కౌన్సిలర్ సతీష్ కు నూతన స్తంభం ఏర్పాటుతో విద్యుత్ పునరుద్ధరించిన విద్యుత్ అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News