బిగ్ బ్రేకింగ్: యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. యాదాద్రిలో గత రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆలయ పునర్నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. కాగా పూర్తిస్థాయిలో ఆలయం ప్రారంభం అయి ఉంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ పనుల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. యాదాద్రిలో గత రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆలయ పునర్నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. కాగా పూర్తిస్థాయిలో ఆలయం ప్రారంభం అయి ఉంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండేది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో తరచూ మార్పులుచేర్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పునర్:నిర్మాణ పనులను పకడ్బందీగా నిర్వహించకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఊహించని ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ప్రమాదాలను ముందస్తుగానే గుర్తించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.