కుక్కల కోసం ఆప్ఘన్ లో ఉండిపోయిన బ్రిటిషర్

దిశ, ఫీచర్స్ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజల అవస్థలు చూస్తూనే ఉన్నాం. దేశం విడిచి వెళ్లే దారిలేక బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలో మనుషులే కాదు, మూగజీవాల మనుగడకు కూడా కష్టమొచ్చిపడింది. కాగా ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆప్ఘన్ లో యానిమల్ షెల్టర్ నిర్వహిస్తున్న మాజీ బ్రిటిష్ రాయల్ మెరైన్ పాల్ ‘పెన్’ ఫార్థింగ్‌.. తన సేఫ్టీ చూసుకోకుండా జంతువులు లేకుండా దేశం […]

Update: 2021-08-26 05:06 GMT

దిశ, ఫీచర్స్ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజల అవస్థలు చూస్తూనే ఉన్నాం. దేశం విడిచి వెళ్లే దారిలేక బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ క్రమంలో మనుషులే కాదు, మూగజీవాల మనుగడకు కూడా కష్టమొచ్చిపడింది. కాగా ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆప్ఘన్ లో యానిమల్ షెల్టర్ నిర్వహిస్తున్న మాజీ బ్రిటిష్ రాయల్ మెరైన్ పాల్ ‘పెన్’ ఫార్థింగ్‌.. తన సేఫ్టీ చూసుకోకుండా జంతువులు లేకుండా దేశం విడిచేది లేదంటున్నాడు.

2007లో ఫార్థింగ్ 25 మంది సిబ్బందితో ‘నౌజాద్’ పేరుతో జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. తన స్టాఫ్‌లో ముగ్గురు ఆప్ఘన్ మొదటి మహిళా పశువైద్యులు కూడా ఉన్నారు. అయితే, 52 ఏళ్ల మెరైన్.. ప్రస్తుతం తన జంతువుల భవిష్యత్తు గురించి భయపడుతున్నాడు. ఎందుకంటే తాలిబన్లు గతంలో ఆఫ్ఘనిస్తాన్‌ను రూల్ చేసినపుడు కుక్కలను అపరిశుభ్రమైనవని, పెంపుడు జంతువుల యాజమాన్యాన్ని నిషేధించారు.

కాగా తన సంరక్షణ కేంద్రంలోని 140 కుక్కలు, 40 పిల్లులను ప్రైవేట్ కార్గో ఫ్లైట్ ద్వారా తరలించాలని భావిస్తున్నాడు. అంతేకాదు 25 మంది స్టాఫ్‌తో పాటు వారి ఫ్యామిలీస్‌ను సైతం దేశం విడిచి రావాలని పార్థింగ్ కోరాడు. యూకేలో వెటర్నరీ డాక్టర్ల కొరత ఉండటంతో అక్కడ తన టీమ్ అవసరం ఉంటుందని, వాళ్లను తీసుకెళ్లేందుకు యూకే గవర్నమెంట్ అనుమతి కోరాడు. ఈ మేరకు మొత్తం 68 మంది సిబ్బందికి యూకే వీసాలు జారీచేసింది. అయితే జంతువులను తరలించడమే ఇప్పుడు సమస్యగా ఉంది.

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన బ్రిటిష్ పొలిటీషియన్ బెన్ వాలెక్.. ఫార్థింగ్ తన సిబ్బంది, జంతువులతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటే, బయలుదేరేందుకు అధికారులు అనుమతిస్తారని ట్విట్టర్‌లో వెల్లడించాడు.

Tags:    

Similar News