ఆ మూడు నగరాలను త్వరలో సందర్శిస్తా
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగతించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణతో ఆ మూడు నగరాలు అభివృద్దిలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు నగరాలను సందర్శించేందుకు తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందునా.. వైరస్ వ్యాప్తి […]
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై తెలుగు రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ స్వాగతించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణతో ఆ మూడు నగరాలు అభివృద్దిలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు నగరాలను సందర్శించేందుకు తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందునా.. వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాత తప్పకుండా సందర్శిస్తాన్నారు.