పెళ్లింట్లో విషాదం.. నవ వధూవరులను విడదీసిన కరోనా!

దిశ, జగిత్యాల : కరోనా మహమ్మారి పెళ్లింట్లో విషాదం నింపింది. కనీసం కాళ్ల పారాణి ఆరకముందే నవ దంపతులు ఒకరిఒకరు దూరం అయ్యారు. ఈ విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. చింతకుంట కృష్ణం రాజు (26)కు ఈ నెల 13న పెళ్లి జరిగింది. పెళ్లైన మూడు రోజులకే అతనికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో టెస్టు చేయించగా పాజివిట్ అని తేలింది. పెళ్లి కుమారుడితో పాటే […]

Update: 2021-05-25 09:48 GMT

దిశ, జగిత్యాల : కరోనా మహమ్మారి పెళ్లింట్లో విషాదం నింపింది. కనీసం కాళ్ల పారాణి ఆరకముందే నవ దంపతులు ఒకరిఒకరు దూరం అయ్యారు. ఈ విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. చింతకుంట కృష్ణం రాజు (26)కు ఈ నెల 13న పెళ్లి జరిగింది. పెళ్లైన మూడు రోజులకే అతనికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో టెస్టు చేయించగా పాజివిట్ అని తేలింది.

పెళ్లి కుమారుడితో పాటే పెళ్లి కూతురు, ఇంట్లోని కుటుంబీకులకు కూడా పాజిటివ్‌ నిర్దారణ జరిగింది. అయితే, రాజుకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కొవిడ్‌కు చికిత్స పొందుతున్న రాజు పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. పెళ్లైన 13 రోజులకే పెళ్లి కొడుకు మరణించటంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వరుడి కుటుంబ సభ్యులకు కరోనా వచ్చినప్పటికీ వారికి వ్యాధి తీవ్రత అంతగా లేదు. అయితే, వివాహం జరిగిన 13 రోజుల వ్యవధిలోనే వరుడు మృతిచెందడంతో అటు ఇంట్లోనూ, ఇటు గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News