షాకింగ్.. నిన్ననే పెళ్లి.. ఇంతలోనే పెళ్లి కూతురు..
దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న జంటపై కాలం కన్నెర్రజేసింది. పెళ్లైన మరసటి రోజే వధూవరుల కుటుంబంలో విషాదం నింపింది. నవ వధువు ఆశలను రోడ్డు ప్రమాదం ఆవిరి చేసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరక ముందే ఘోర ప్రమాదంలో పెండ్లి కూతురు, వధువు తండ్రి మృతిచెందారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న జంటపై కాలం కన్నెర్రజేసింది. పెళ్లైన మరసటి రోజే వధూవరుల కుటుంబంలో విషాదం నింపింది. నవ వధువు ఆశలను రోడ్డు ప్రమాదం ఆవిరి చేసింది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరక ముందే ఘోర ప్రమాదంలో పెండ్లి కూతురు, వధువు తండ్రి మృతిచెందారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాత మద్దిపడగా గ్రామానికి చెందిన కొండ రాజాం తన కూతురి పెండ్లి బుధవారం 25 తేదీ రోజు మద్దిపడగా గ్రామంలో ఆడంబరంగా చేశారు. పెండ్లి చేసి అత్తవారింటికి పంపించి రెండవ రోజు మారుపెండ్లికి మహారాష్ట్ర బల్లర్ష దగ్గర రాజురాకు పోయి భోజనం చేసి తిరిగి వస్తుండగా ఇంటికి చేరడానికి 5 నిముషాల ముందు ప్రమాదం సంభవించింది. పాండవపూర్ గ్రామ సమీపంలోని కడెం బ్రిడ్జిని కారు ఢీ కొట్టడంతో పెండ్లి కూతురు మౌనిక ,పెండ్లి కూతురు తండ్రి రాజాం అక్కడికక్కడే మృతి చెందారు. వారు మృతి చెందడంతో వారి కుటుంబం శోక సముద్రంలో మునిగారు. పెండ్లి కొడుకు జనార్దన్‌కు త్రీవ్ర గాయాలు కాగా అతని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.