టీ20 వరల్డ్ కప్‌లో ‘నా ఫేవరెట్ టీం’ ఇదేనంటున్న బ్రెట్ లీ..
దిశ, వెబ్‌డెస్క్ : అరబ్ కంట్రీ వేదికగా జరిగే టీ20 వరల్డ్ మ్యాచ్‌లో బరిలోకి దిగే జట్లలో ఇండియా జట్టు హాట్ ఫేవరేట్ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ తెలిపాడు. ఈ టోర్నలో ఫైనల్‌కు చేరే సత్తా కోహ్లీసేనకు ఉందన్నాడు. ఐపీఎల్- 2021 సీజన్‌లో సత్తా చాటిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్.. టీ 20 ప్రపంచకప్‌లో చెలరేగితే భారత జట్టుకు తిరుగుండదని జోస్యం చెప్పాడు. ప్రపంచకప్‌లో రాహుల్ రాణిస్తే.. కెప్టెన్ విరాట్ […]
దిశ, వెబ్‌డెస్క్ : అరబ్ కంట్రీ వేదికగా జరిగే టీ20 వరల్డ్ మ్యాచ్‌లో బరిలోకి దిగే జట్లలో ఇండియా జట్టు హాట్ ఫేవరేట్ అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ తెలిపాడు. ఈ టోర్నలో ఫైనల్‌కు చేరే సత్తా కోహ్లీసేనకు ఉందన్నాడు. ఐపీఎల్- 2021 సీజన్‌లో సత్తా చాటిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్.. టీ 20 ప్రపంచకప్‌లో చెలరేగితే భారత జట్టుకు తిరుగుండదని జోస్యం చెప్పాడు. ప్రపంచకప్‌లో రాహుల్ రాణిస్తే.. కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గుతుందని, అప్పుడు అతను స్వేచ్ఛగా ఆడేందుకు ఆస్కారం ఉటుందన్నాడు.
IPLలో అత్యధిక పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. టీ20 ప్రపంచకప్‌లో కూడా టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని అభిప్రాయం వ్యక్తంచేశాడు. భారత బ్యాటింగ్ లైన్ అప్‌కు అతను వెన్నెముక అన్నారు. రాహుల్ మెరుగ్గా రాణిస్తే.. కోహ్లీపై సేనకు విజయం తథ్యమన్నారు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇదే చివరి టీ-20 వరల్డ్ కావున, అతను తనదైన సహజ రీతిలో ఫ్రీగా ఆడుకునేందుకు అవకాశముంటుందన్నాడు. అయితే, ఇటీవల భారత్ అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చెలాయిస్తోందన్నాడు.
నా వరకైతే భారత్ హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోందన్నారు. గత కొంతకాలంగా ఆస్ట్రేలియా పొట్టి ఫార్మాట్లో రాణించలేకపోతోందని తెలిపాడు.కాగా, ఈ టీ20 ప్రపంచకప్‌కు అత్యుత్తమ జట్టును ఎంపిక చేసినట్టు వివరించాడు. టైటిల్ పోరులో ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు కచ్చితంగా గట్టి పోటీనిస్తుందని చెప్పాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడిగా కచ్చితంగా మా జట్టే కప్ గెలవాలని బలంగా కోరుకుంటున్నానని’ బ్రెట్ లీ వెల్లడించాడు.