BREAKING : అస్సాంలో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు

అస్సాం భూమి ఒక్కసారిగా కంపించింది. భూమిలో దాదాపు 23 కి.మీ లోతులో బ్రహ్మపుత్ర దక్షిణ ఒడ్డున తూర్పు కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో రాత్రి 7.12 గంటలకు భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదికను విడుదల చేసింది.

Update: 2024-01-17 04:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అస్సాం భూమి ఒక్కసారిగా కంపించింది. భూమిలో దాదాపు 23 కి.మీ లోతులో బ్రహ్మపుత్ర దక్షిణ ఒడ్డున తూర్పు కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో రాత్రి 7.12 గంటలకు భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదికను విడుదల చేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5‌గా నమోదైంది. నాగాలాండ్ సరిహద్దుకు సమీపంలోని గౌహతి నుంచి తూర్పు-ఆగ్నేయ-తూర్పుగా 170 కి.మీ. పొరుగున ఉన్న పశ్చిమ కర్బీ అంగ్లాంగ్, హోజాయ్, డిమా హసావో, గోలాఘాట్, నాగావ్ జిల్లాల్లోని ప్రజలు కూడా ఒక్కసారిగా కుదుపునకు గురయ్యారు. అదేవిధంగా నాగాలాండ్, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించవచ్చని నివేదిక పేర్కొంది. భూకంపంతో ఎవరికీ ఎలాంటి గాయాలు లేదా ఆస్తి నష్టం జరగలేదని ప్రభుత్వం వెల్లడించింది. 

Tags:    

Similar News