IPL: RCB కొత్త కెప్టెన్ అతడే..? ఆకాశ్ చోప్రా

Update: 2022-02-13 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 15వ సీజన్ మెగా వేలం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ప్లేయర్ల కోసం ప్రాంఛైజ్‌లు కోట్లు కుమ్మరిస్తున్నాయి. అయితే, మెగా వేలంలో కొన్ని విషయాలు మాత్రం అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి. భారీ ధర పలుకుతారనుకున్న ప్లేయర్లను చాలా తక్కువ రేటుకే ప్రాంఛైజ్‌లు దక్కించుకున్నాయి. మెగా వేలానికి ముందు ఆస్ట్రేలియా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ భారీ ధర పలుకుతాడని క్రీడా పండితులు అంచనా వేశారు. కానీ, వారి అంచనాలు తలకిందులయ్యాయి. వార్నర్‌ను 6.25 కోట్లకే ఢిల్లీ దక్కించుకుంది. ఈ వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్స్‌ పంట పండింది. హర్షల్ పటేల్, ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్, మనోజ్ తివారీ భారీకు అమ్ముడయ్యారు. అయితే గతంలో ఐపీఎల్‌లో మెరిసిన స్టార్ ప్లేయర్స్ సురేష్ రైనా, డేవిడ్ మిల్లర్, మోర్గాన్, ఇమ్రాన్ తాహిర్ వంటి ఆటగాళ్లను అసలు ప్రాంఛైజ్‌లు పట్టించుకోకపోవడం గమనార్హం.

అయితే, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్ వరకు ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ.. ఈ సీజన్ నుండి కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. దీనితో ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో ఉంది. ఈ మెగా వేలంలో ఆర్సీబీ మాజీ సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ను రూ. 7కోట్లకు కొనుగోలు చేసింది. డుప్లెసిస్‌ ఎంపికపై కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ' ఆర్సీబీ 100 శాతం స్టార్ బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్‌నే తమ జట్టు తదుపరి కెప్టెన్‌గా ప్రకటిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. డుప్లెసిస్‌కు జాతీయ జట్టుకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉందన్నారు. అతను జట్టులో ఉండటం వల్ల సమతూకం వస్తుందని ఆకాష్ చోప్రా పేర్కొన్నారు. అంతే కాకుండా డుప్లెసిస్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డ్‌లు ఉన్నాయని అన్నారు.

Tags:    

Similar News