ఏపీలో 13 గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్రేక్

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని 13 గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇవాళ నుంచి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు మొదటి దశ నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ నుంచి జనవరి 31 సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేయాల్సి ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. అప్పటి నుంచి 3 రోజులపాటు ఫిబ్రవవరి 7 […]

Update: 2021-01-28 22:42 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని 13 గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇవాళ నుంచి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు మొదటి దశ నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ నుంచి జనవరి 31 సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేయాల్సి ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. అప్పటి నుంచి 3 రోజులపాటు ఫిబ్రవవరి 7 సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు.. 9న ఎన్నికలు నిర్వహించనున్నారు.
కాగా ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని 13గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. పంచాయతీల విలీనం, విభజనపై కోర్టును ఆశ్రయించారు స్థానికులు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్ట్ స్టే విధించింది. దీంతో కడపజిల్లాకు చెందిన 13 గ్రామాల్లో ఎన్నికలకు బ్రేకులు పడ్డాయి.

 

Tags:    

Similar News