ఆ జంట.. బీచ్‌లో ‘స్పేస్’ టచ్ ఇచ్చారు
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. జేబులో శానిటైజర్, మూతికి మాస్క్, చేతులకు గ్లౌజులు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకెళ్లినా.. ఎక్కడ ఏ చిన్న నిర్లక్ష్యం వల్ల కరోనా వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కరోనా వల్ల ఇంటికే పరిమితమైన ఓ జంట.. కాసేపు అలా బీచ్‌కు వెళ్లాలనుకుంది. కానీ, కరోనా టైమ్‌లో బయటకెళ్లడం అంత సేఫ్ కాదనిపించింది. ఈ నేపథ్యంలోనే వారికో సూపర్ ఐడియా […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో.. జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. జేబులో శానిటైజర్, మూతికి మాస్క్, చేతులకు గ్లౌజులు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని బయటకెళ్లినా.. ఎక్కడ ఏ చిన్న నిర్లక్ష్యం వల్ల కరోనా వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కరోనా వల్ల ఇంటికే పరిమితమైన ఓ జంట.. కాసేపు అలా బీచ్‌కు వెళ్లాలనుకుంది. కానీ, కరోనా టైమ్‌లో బయటకెళ్లడం అంత సేఫ్ కాదనిపించింది. ఈ నేపథ్యంలోనే వారికో సూపర్ ఐడియా తట్టింది. వెంటనే రియో డిజెనీరాలోని ఓ బీచ్‌లో వాలిపోయారు ఆ లవ్‌లీ కపుల్. కాగా, వారి చుట్టూ జనం పోగై, సెల్ఫీలు తీసుకున్నారు. ఫొటోలకు పోజులిమ్మంటూ.. వారిని రిక్వెస్ట్ చేశారు. ఇంతకీ ఎందుకలా అందరూ ఆ జంట వెంట పడ్డారు?
బీచ్ అనగానే.. అందరూ అక్కడి వాతావరణానికి తగ్గట్లు కురచ దుస్తులు వేసుకుని వస్తారు. కరోనా టైమ్ కాబట్టి.. మూతికి మాస్క్ లేదా స్కార్ఫ్ చుట్టుకుని వస్తారు. మరీ అంటే.. ఫేస్ షీల్డ్, చేతులకు గ్లోవ్స్ వేసుకుని వస్తారు. కానీ బ్రెజిల్‌కు చెందిన టెర్సియో గల్డినో, అలీసియా లీమా జంట మాత్రం వింతగా అదేదో తాము అంతరిక్ష యాత్రకు పోయినట్లుగా.. సముద్ర తీరానికి స్పేస్ సూట్‌లో వెళ్లారు. దాంతో ఆ జంట వచ్చిన తీరుకి అక్కడ బీచ్‌లో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. కరోనా బారిన పడకుండా ఉండడానికే తాము ఈ డ్రెస్‌ను ఎంచుకున్నట్లు ఆ జంట వెల్లడించింది. తనకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి సోకి తగ్గిందని, ఇలాంటి సమయంలో కరోనా సోకితే తాను ఎట్టిపరిస్థితుల్లోనూ బతకనని టెర్సియో పేర్కొన్నారు. అయితే బీచ్‌కు రావాలని అనిపించిందని, అందుకోసమే ఈ స్పేస్ సూట్ ఐడియా ఫాలో అయ్యామని చెప్పుకొచ్చారు. వారి ఐడియాకు జనం ఫిదా కాగా, వారితో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.