గర్ల్‌ఫ్రెండ్‌కు 11 రూల్స్.. బాయ్‌ఫ్రెండ్ పై నెటిజన్లు ఫైర్

దిశ, ఫీచర్స్ : ‘రిలేషన్‌షిప్’‌లో కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. బంధం బలపడాలంటే ఇగోలను పక్కన పెట్టి, ఇద్దరూ కలిసి తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందడుగు వేయాలి. కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ, ఒకరి పనిని మరొకరు గౌరవించుకోవాలి. సంతోష సమయంలో వెంట లేకున్నా, కష్టకాలంలో వెన్నంటి నిలిస్తే ఆ బంధం మరింత బలపడుతుంది. కానీ ఇద్దరిమధ్య ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే సంబంధాన్ని కొనసాగించడం చాలాకష్టం. అమెరికా యూనివర్సిటీ విద్యార్థి ‘కరోలిన్’ విషయంలో ఇదే జరిగింది. ఆమె […]

Update: 2021-09-20 05:57 GMT

దిశ, ఫీచర్స్ : ‘రిలేషన్‌షిప్’‌లో కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. బంధం బలపడాలంటే ఇగోలను పక్కన పెట్టి, ఇద్దరూ కలిసి తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందడుగు వేయాలి. కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ, ఒకరి పనిని మరొకరు గౌరవించుకోవాలి. సంతోష సమయంలో వెంట లేకున్నా, కష్టకాలంలో వెన్నంటి నిలిస్తే ఆ బంధం మరింత బలపడుతుంది. కానీ ఇద్దరిమధ్య ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే సంబంధాన్ని కొనసాగించడం చాలాకష్టం. అమెరికా యూనివర్సిటీ విద్యార్థి ‘కరోలిన్’ విషయంలో ఇదే జరిగింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ తనతో రిలేషన్‌షిప్ కొనసాగించడానికి 11రూల్స్ పెట్టాడు.

కరోలిన్.. తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ తనకు విధించిన 11 నియమాలను సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేసింది. అతడు తనతో యూనివర్శిటీలో లేనప్పుడు ఆ యువతి11రూల్స్ పాటించాలని కోరుతున్నాడు.

1. ఈ రూల్స్ చదివాక నన్ను నిర్లక్ష్యం చేయొద్దు.
2. స్నాప్‌చాట్‌లో ఎప్పుడూ నీ లోకేషన్ టర్న్ ఆఫ్ చేయొద్దు.
3. మా అమ్మ చెప్పిన దుస్తులనే ధరించాలి.
4. 25 అడుగుల డిస్టెన్స్ మెయింటెయిన్స్ చేస్తూ బాయ్స్‌తో మాట్లాడాలి.
5. డ్రింకింగ్ అస్సలు చేయొద్దు.
6. క్రాప్ టాప్స్ వేసుకోవద్దు. టైట్ క్లాతింగ్ ధరించడానికి వీల్లేదు.
7. రాత్రి 9లోపు ఇంటికి చేరుకోవాలి. నాకు నువ్వు ఒంటరిగా ఉన్నట్లు తెలియాలి.
8. నో హౌజ్, ఫ్రాట్, డోర్మ్ పార్టీస్.
9. ఇతర పురుషుల బట్టలు వేసుకోవద్దు.
10. ఇతర అబ్బాయిలతో హ్యాండ్ సైజెస్ పోల్చడం, కౌగిలించుకోకూడదు. ముద్దు పెట్టుకోకూడదు.
11. నేను నీకిచ్చిన ఉంగరాన్ని ఎప్పటికీ తీసివేయవద్దు

ఇప్పటికే ఈ పోస్ట్ వైరల్ కాగా, కరోలిన్ దీనికి అనేక ఫాలో- అప్ టిక్‌టాక్‌లను చేసింది. ఓ వీడియోలో బ్యాడ్ రిలేషన్‌షిప్స్ నుంచి ఎలా సహాయం పొందవచ్చో వివరించింది. తనలాగే చాలామంది ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఈ ప్రవర్తన గృహహింస లాంటిదేనని ఆమె తెలిపింది. ఒకవేళ ఎవరైనా తమ బాయ్ ఫ్రెండ్ నుంచి ఇలాంటి చర్యతో బాధపడుతుంటే, సాయం చేయడానికి ఎన్నో రిసోర్సెస్, హాట్ లైన్స్ ఉన్నాయని పేర్కొంది. లక్షలాది మంది కరోలిన్‌కు సపోర్ట్ చేస్తుండగా, అతడి రిలేషన్‌షిప్ నుంచి కరోలిన్ బయటపడినందుకు హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News