ప్రేమించి మోసం చేశాడు.. విదేశంలో సెటిల్ అయ్యాడు

దిశ, చండూరు : వెంటపడి ప్రేమించాడు. తన ప్రేమను ప్రియురాలు అంగీకరించాక ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు. కొద్ది రోజులకు ఉన్నత చదువుల పేరుతో వేరే దేశం వెళ్లిన ప్రియడు.. తీరా ప్రియురాలు పెండ్లి ప్రస్తవన తీసుకొచ్చే సరికి ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించి ప్రియుడితో తనకు పెండ్లి జరిపించి న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామానికి చెందిన ఉత్తరపల్లి మౌనిక తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దీంతో తన […]

Update: 2021-02-10 12:15 GMT

దిశ, చండూరు : వెంటపడి ప్రేమించాడు. తన ప్రేమను ప్రియురాలు అంగీకరించాక ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు. కొద్ది రోజులకు ఉన్నత చదువుల పేరుతో వేరే దేశం వెళ్లిన ప్రియడు.. తీరా ప్రియురాలు పెండ్లి ప్రస్తవన తీసుకొచ్చే సరికి ముఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించి ప్రియుడితో తనకు పెండ్లి జరిపించి న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురం గ్రామానికి చెందిన ఉత్తరపల్లి మౌనిక తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దీంతో తన మేనమామ వద్ద పెరిగి బీటెక్ వరకు చదివింది. అదే గ్రామానికి చెందిన ముద్దం శివతో 2013లో ఆమెకు పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమగా మారింది. 2016 వరకు వీరి ప్రేమ ప్రయాణం బాగానే సాగింది. ఉన్నత చదువుల కోసం శివ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అనంతరం ప్రేమ వ్యవహారం అలాగే కొనసాగింది. తనను పెండ్లి చేసుకోవాలని మౌనిక అతడిపై ఒత్తిడి చేసింది.

దీంతో పెండ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని తనను మర్చిపోవాలని అతడు చెప్పడంతో ఆవేదనకు లోనైంది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడిన ఆమెకు మేనమామ ధైర్యం చెప్పి 2019 జూన్ 12న మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. అలాగే ప్రిన్సిపల్ సెక్రెటరీ‌కి, కేంద్ర హోంశాఖకు పోలీసుల ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌కు సైతం ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత శివ‌పై లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. కేసు నమోదై ఏండ్లు గడుస్తున్నా శివ‌ను ఇండియాకు తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగడం బాధితురాలు ఆవేదనకు లోనవుతోంది. ఇప్పటికైనా డీజీపీ చొరవ చూపి శివను ఇండియాకు రప్పించి పెండ్లి జరిపించాలని మౌనికతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    

Similar News