బాలుడిని ఈడ్చుకెళ్లిన లారీ…!

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీపై విద్యుత్ వైర్లు తెగి పడటంతో.. అవి కాస్తా ఆ సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాజు (12) అనే బాలుడి కాలుకు చుట్టుకున్నాయి. దీంతో సదరు బాలుడిని లారీ రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు బైకుల సాయంతో లారీని అడ్డగించి బాలుడిని రక్షించారు. అనంతం బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన […]

Update: 2020-05-22 10:40 GMT

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీపై విద్యుత్ వైర్లు తెగి పడటంతో.. అవి కాస్తా ఆ సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రాజు (12) అనే బాలుడి కాలుకు చుట్టుకున్నాయి. దీంతో సదరు బాలుడిని లారీ రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు బైకుల సాయంతో లారీని అడ్డగించి బాలుడిని రక్షించారు. అనంతం బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నడికూడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News