Tokyo Olympics : బాక్సింగ్‌లో భారత్‌కు నిరాశే..
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ దశలోనే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియాకు తొలి సిల్వర్ మెడల్ దక్కిన విషయం తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆ ఘనతను సాధించిన అథ్లెట్‌గా మీరాబాయి చాను నిలిచింది. అయితే, బాక్సింగ్‌లో మాత్రం భారత్‌కు నిరాశే ఎదురైంది. 69 కేజీల విభాగంలో దేశీయ బాక్సర్ వికాస్ కృష్ణన్ ఓటమి పాలయ్యాడు. జపాన్ క్రీడాకారుడు ఒకజావా చేతిలో 0-5 తేడాతో […]
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఒలింపిక్స్ ప్రారంభ దశలోనే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియాకు తొలి సిల్వర్ మెడల్ దక్కిన విషయం తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆ ఘనతను సాధించిన అథ్లెట్‌గా మీరాబాయి చాను నిలిచింది. అయితే, బాక్సింగ్‌లో మాత్రం భారత్‌కు నిరాశే ఎదురైంది. 69 కేజీల విభాగంలో దేశీయ బాక్సర్ వికాస్ కృష్ణన్ ఓటమి పాలయ్యాడు. జపాన్ క్రీడాకారుడు ఒకజావా చేతిలో 0-5 తేడాతో వికాస్ ఓటమిని చవిచూశాడు. ఇప్పటివరకు ఇండియా ఖాతాలో ఒకే ఒక్క మెడల్ ఉండగా.. మరికొందరు అథ్లెట్లు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.