మిత్రుడి పెళ్లికి గిఫ్ట్‌గా బాండ్ పేపర్.. ఏం రాశారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

దిశ, వెబ్‌డెస్క్ : సహజంగా మనం బాండ్ పేపర్ ఎందుకు రాస్తాం.. ఆస్తుల క్రయవిక్రయాలు, లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో రాసుకుంటాం. కానీ ఓ మిత్ర బృందం వినూత్నంగా బాండ్ పేపర్ రాసింది. తన నిస్సాహయత, కరోనా సృష్టించిన కల్లోలం, ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ మిత్రుడి పెళ్లికి కానుకగా పంపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ పెళ్లికి బహుమతులు ఇవ్వలేమని, ప్రభుత్వ పథకాల నుంచి తమకు డబ్బులు రాగానే గిఫ్ట్‌లు ఇస్తామని రూ.10 బాండ్ పేపర్ రాసి […]

Update: 2021-08-17 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సహజంగా మనం బాండ్ పేపర్ ఎందుకు రాస్తాం.. ఆస్తుల క్రయవిక్రయాలు, లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో రాసుకుంటాం. కానీ ఓ మిత్ర బృందం వినూత్నంగా బాండ్ పేపర్ రాసింది. తన నిస్సాహయత, కరోనా సృష్టించిన కల్లోలం, ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ మిత్రుడి పెళ్లికి కానుకగా పంపించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ పెళ్లికి బహుమతులు ఇవ్వలేమని, ప్రభుత్వ పథకాల నుంచి తమకు డబ్బులు రాగానే గిఫ్ట్‌లు ఇస్తామని రూ.10 బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. డబ్బులు వచ్చినా పెళ్లి గిఫ్ట్ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిత్ర బృందం రాసిన ఈ బాండ్ పేపర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పెళ్లికి పంపిన బాండ్ పేపర్ యథావిధిగా మీకోసం..

యువకుడిని మత్తులోకి దింపిన ఒకే అమ్మాయి.. మూడు గొంతులు, మూడు పాత్రలు!

‘‘ప్రియ మిత్రుడు కరోతు రాముకు మిత్రబృందం వ్రాసిఇచ్చు హామీ పత్రం. మిత్రమా.. నీ వివాహము జరుగుట మాకు ఎంతో ఆనందకరం. ఈ శుభ సందర్భంగా నీకు మంచి బహుమతి బహుకరించాలని అనుకున్నాము. కానీ కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా పనులు లేక చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాము. ఇప్పుడు నీకు బహుమతి ఇచ్చే అవకాశం లేనందున త్వరలో డ్వాక్రా డబ్బులు గాని, అమ్మవడి డబ్బులు కాని, రైతు భరోసా కాని ఎటువంటి డబ్బులు మా అకౌంట్‌లో పడినా మీమందరం ఆ డబ్బులతో నీకు మంచి బహుమతి ఇస్తామని వ్రాసి ఇచ్చుచున్నాము. అలా ఇవ్వని పక్షాన నీవు తీసుకొను చట్టపరమైన ఏ చర్యలకైనా మేము పూర్తి బాధ్యత వహిస్తామని అంగీకరిస్తున్నాము.’’ అని 13 ఆగస్ట్ 2021 న చినమాడ కనకరాజు పేరిట మిత్రబృందం రూ.10ల నోటరీ బాండ్ పేపర్‌ను రాసి ఇచ్చింది.

Tags:    

Similar News