‘బాంబే బరో’ స్పెషల్ ఫుడ్ ఆఫర్.. ఓన్లీ ఫర్ లేడీస్

దిశ, ఫీచర్స్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పలు సంస్థలు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించగా.. దుబాయ్‌లోని ఫేమస్ ఇండియన్ బార్ అండ్ ఈటరీ ‘బాంబే బరో’ మహిళల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ హోటల్.. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో ఇటీవలే ప్రారంభం కాగా, ఉమెన్స్ డే రోజున ఇక్కడికి వచ్చే మహిళలందరికీ ఈ ఫుడ్ ఆఫర్‌‌ను కల్పించింది. కాగా, ఈ హోటల్‌లో లభించే ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ […]

Update: 2021-02-23 08:16 GMT

దిశ, ఫీచర్స్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పలు సంస్థలు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించగా.. దుబాయ్‌లోని ఫేమస్ ఇండియన్ బార్ అండ్ ఈటరీ ‘బాంబే బరో’ మహిళల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ హోటల్.. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC)లో ఇటీవలే ప్రారంభం కాగా, ఉమెన్స్ డే రోజున ఇక్కడికి వచ్చే మహిళలందరికీ ఈ ఫుడ్ ఆఫర్‌‌ను కల్పించింది. కాగా, ఈ హోటల్‌లో లభించే ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది కావడం విశేషం.

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా హోటల్‌కు వచ్చే నారీమణులు ఓ గ్రూపుగా(ఐదుగురు) హాజరై స్పెషల్ మెనూ ఆఫర్ ప్రకారం.. ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఈ ఆఫర్ ప్రైస్ 125 దిరమ్స్ (రూ.2,467) కాగా, ఫుడ్‌ మెనూలో పాపడ్ పన్నీర్, హిమాలయన్ మష్రూం, గుంటూరు స్పెషల్ చికెన్ ఉండనున్నాయి. ఇది కాకుండా హోటల్ వార్షికోత్సవం సందర్భంగా ఫుడ్ మెనూలో యాడ్ చేసిన ‘రాయల్ గోల్డ్ బిర్యానీ’ ప్లేట్ ప్రైస్‌ను 1,000 దిరమ్స్ (రూ.19,704)గా నిర్ణయించారు. కాగా ఈ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. మూడు కేజీల బిర్యానీ అంటే ‘చికెన్ బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్/శాఫ్రాన్ రైస్‌’ వేరియంట్లను పెద్ద గోల్డ్ మెటాలిక్ ప్లేట్‌లో సర్వ్ చేస్తారు. బేబీ ఆలుగడ్డలు, ఉడకించిన గుడ్లతో ప్లేటును అలంకరిస్తారు. కశ్మీరీ ల్యాంబ్ సీక్ కబాబ్స్, ఓల్డ్ ఢిల్లీ ల్యాంబ్ చాప్స్, రాజ్‌పుట్ చికెన్ కబాబ్స్, మొఘలాయ్ కోఫ్తాలు, మలాయ్ చికెన్ వంటివి కూడా బిర్యానీపై అలంకరించి.. బిర్యానీ ప్లేటు మొత్తాన్ని 23 కేరెట్ల బంగారం రేకులతో అలంకరిస్తారు. ఈ ప్లేట్‌ సర్వ్ చేసేందుకు హోటల్ సిబ్బందికి 45 నిమిషాలు పడుతుంది. ప్లేట్ బిర్యానీ ఒక్కటి నలుగురి నుంచి ఆరుగురికి ఎంచక్కా సరిపోతుంది.

Tags:    

Similar News