తాజ్ మహల్‌లో బాంబు కలకలం.. అప్రమత్తమైన సిబ్బంది
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్‌లో బాంబు కలకలం రేగింది. తాజ్‌లో బాంబు పెట్టారని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీసులు, భద్రతాసిబ్బంది కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. సమాచారం అందిన వెంటనే అక్కడ ఉన్న పర్యాటకులను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తాజ్ మహల్ చుట్టుపక్కల పరిసరాలను తమ […]
దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్‌లో బాంబు కలకలం రేగింది. తాజ్‌లో బాంబు పెట్టారని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీసులు, భద్రతాసిబ్బంది కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. సమాచారం అందిన వెంటనే అక్కడ ఉన్న పర్యాటకులను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తాజ్ మహల్ చుట్టుపక్కల పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది..? దీని వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో తాజ్ మహల్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.