తాజ్ మహల్ వద్ద అనుమాస్పద డబ్బా.. తెరిచి చూసి షాక్ అయిన సిబ్బంది
దిశ, వెబ్ డెస్క్: ప్రేమకు చిహ్నమైన తాజమహల్ వద్ద ఒక అనుమానాస్పద డబ్బా కలకలం రేపింది. ఆగ్రాలోని తాజమహల్ సమీపంలోని పురాణీ మండీ ప్రాంతం షాజహాన్ గార్డెన్ వద్ద ఓ చిన్న క్యాన్‌కు తాళం వేసి ఉన్న ఒక డబ్బా కొద్దిసేపు పోలీసులకు చెమటలు పట్టించింది. ఆ డబ్బా లో పేలుడు పదార్దాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. వెంటనే పోలీసులు ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ ని ఏర్పాటు చేశారు. బాంబ్ […]
దిశ, వెబ్ డెస్క్: ప్రేమకు చిహ్నమైన తాజమహల్ వద్ద ఒక అనుమానాస్పద డబ్బా కలకలం రేపింది. ఆగ్రాలోని తాజమహల్ సమీపంలోని పురాణీ మండీ ప్రాంతం షాజహాన్ గార్డెన్ వద్ద ఓ చిన్న క్యాన్‌కు తాళం వేసి ఉన్న ఒక డబ్బా కొద్దిసేపు పోలీసులకు చెమటలు పట్టించింది. ఆ డబ్బా లో పేలుడు పదార్దాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. వెంటనే పోలీసులు ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ ని ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్ ఎంతో జాగ్రత్తగా ఆ క్యాన్ ని తెరిచారు. చివరకు అందులో ఎటువంటి పేలుడు పదార్ధాలు లేవని, ఆహార పదార్థాలు మాత్రమే ఉన్నయని వారు గుర్తించారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ క్యాన్ అక్కడికి ఎవరు తెచ్చారు? ఎందుకు ఇక్కడ పెట్టారు? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.