బాలీవుడ్ యాక్ట్రెస్‌కు ఎమర్జెన్సీ సర్జరీ
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యాక్టర్ శ్రుతి సేతు మేజర్ హెల్త్ ప్రాబ్లమ్‌తో ఎమర్జెన్సీ సర్జరీ చేయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. హఠాత్తుగా జరిగిన సర్జరీతో క్రిస్మస్, న్యూ ఇయర్ ప్లాన్స్ అన్నీ ఆగిపోయాయని.. మొత్తానికి ఒక పెద్ద ఆరోగ్య సమస్య నుంచి బయటపడినందుకు 2020కి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సమయంలో తాను నేర్చుకున్న పాఠాలను అభిమానులతో పంచుకుంది. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేసిన శ్రుతి.. అహం అసలు పరిగణలోకి రాదని, మనమంతా కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యాక్టర్ శ్రుతి సేతు మేజర్ హెల్త్ ప్రాబ్లమ్‌తో ఎమర్జెన్సీ సర్జరీ చేయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. హఠాత్తుగా జరిగిన సర్జరీతో క్రిస్మస్, న్యూ ఇయర్ ప్లాన్స్ అన్నీ ఆగిపోయాయని.. మొత్తానికి ఒక పెద్ద ఆరోగ్య సమస్య నుంచి బయటపడినందుకు 2020కి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సమయంలో తాను నేర్చుకున్న పాఠాలను అభిమానులతో పంచుకుంది.
హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్ చేసిన శ్రుతి.. అహం అసలు పరిగణలోకి రాదని, మనమంతా కూడా కేవలం జీవశాస్త్రం మాత్రమే అని తెలిపింది. ఆహారం అనేది కేవలం మెదడుకు మందు అని, శరీరం గ్లూకోజ్ డ్రాప్స్‌తో జీవించగలదని చెప్పింది. శారీరక విధులు కూడా నమ్మశక్యం కాని ఇంజినీరింగ్ పని అన్న బాలీవుడ్ యాక్ట్రెస్.. ఉదయం కళ్లు తెరవగలిగినందుకు, రాత్రి నిద్రపోయే అవకాశం ఉన్నందుకు కృతజ్ఞతగా ఉండాలని కోరింది. శరీరంతో మనం మంచిగా ఉంటే.. అది మనకు అవసరమైనప్పుడు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. మీరు ప్రేమిస్తున్న, మీ శ్రేయస్సు గురించి శ్రద్ధ చూపిస్తున్న వ్యక్తులను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని సూచించింది. ప్రతీది మంచి సమయంలో జరిగినందుకు సంతోషంగా ఉన్నానని తెలిపిన శ్రుతి సేతు.. 2020 ప్రత్యేకతను గుర్తు చేసేందుకు తన శరీరంపై మచ్చలు ఏర్పడ్డాయంది. అవి థాంక్‌ఫుల్‌గా ఉండాలని ఎప్పుడూ గుర్తు చేస్తాయని తెలిపింది. న్యూ ఇయర్‌కు అభిమానులకు టన్నుల కొద్ది ప్రేమను పంపుతున్నానని.. అందరూ అందరి పట్ల దయగా, ప్రేమగా ఉండాలని కోరింది.
కాగా శ్రుతి సేతు.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్, ఫనా’ లాంటి సినిమాలతో పాటు ‘జెస్టినేషన్ అన్ నోన్, మెంటల్ హుడ్’ వెబ్ సిరీస్‌లో నటించింది. పలు టీవీ షోస్ కూడా చేసింది శ్రుతి.