‘ఆ చట్టాలే… నేటికీ అమలవుతున్నాయి’

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో వందల ఏళ్ల క్రితం నాటి చట్టాలే నేటికీ అమలవుతున్నాయనీ వాటన్నింటిని రూపుమాపి రెవెన్యూ కోడ్ తీసుకరానున్నామనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ పట్టణంలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ… జాగిర్దార్ అబాలిషన్, ఇనాం అబాలిషన్ యాక్టు, తెలంగాణా టెనెంట్సీ యాక్ట్ వంటివి 70 వరకు ఉన్న చట్టాలన్నింటినీ క్రోడీకరించి ఒకే చట్టాన్ని తీసుకురానున్నామని చెప్పారు. వీటన్నింటి కోసమే రెవెన్యూ […]

Update: 2020-09-13 05:37 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో వందల ఏళ్ల క్రితం నాటి చట్టాలే నేటికీ అమలవుతున్నాయనీ వాటన్నింటిని రూపుమాపి రెవెన్యూ కోడ్ తీసుకరానున్నామనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ పట్టణంలో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ… జాగిర్దార్ అబాలిషన్, ఇనాం అబాలిషన్ యాక్టు, తెలంగాణా టెనెంట్సీ యాక్ట్ వంటివి 70 వరకు ఉన్న చట్టాలన్నింటినీ క్రోడీకరించి ఒకే చట్టాన్ని తీసుకురానున్నామని చెప్పారు. వీటన్నింటి కోసమే రెవెన్యూ కోడ్ తయారు చేస్తున్నామని వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నామన్నారు.

కరీంనగర్‌ జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి, ప్రత్యేకంగా కరీంనగర్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయించామని తెలిపారు. అయితే ఇప్పుడు జాతీయ రహదారుల అనుసంధానం ప్రకృయ మూలన పడిందని, ఆఫీసు కూడా తెరివడం లేదని వినోద్ కుమార్ అన్నారు. విభజన చట్టంలోనే తెలంగాణకు జాతీయ రహదారులు తక్కువ సంఖ్యలో ఉన్నాయన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్‌ను నేషనల్ హైవేస్‌తో లింక్ చేసేందుకు మంజూరు చేయిస్తే, ఇప్పుడు కొన్ని హైవేలు రద్దు అయ్యాయని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్ రావు, బల్దియా కమిషనర్ వల్లూరి క్రాంతిలు పాల్గొన్నారు.

Tags:    

Similar News