కేసీఆర్‌కు బొడిగె శోభ సవాల్.. ఎర్రబెల్లిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
దిశ, కమలాపూర్: కమలాపూర్ నిర్వహించిన టీఆర్ఎస్ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులతో వెళ్లగొట్టించి తనను అవమాన పరిచారని ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా మహిళా ఎంపీడీవోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి మరోసారి కార్యక్రమానికి పిలిచి మహిళా ఎంపీపీని ఎలా అవమానిస్తారని నిలదీశారు. హుజురాబాద్‌లో ఈటల గెలుపు ఖాయమన్న కోపంతోనే ఇటువంటి […]
దిశ, కమలాపూర్: కమలాపూర్ నిర్వహించిన టీఆర్ఎస్ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోలీసులతో వెళ్లగొట్టించి తనను అవమాన పరిచారని ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా మహిళా ఎంపీడీవోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి మరోసారి కార్యక్రమానికి పిలిచి మహిళా ఎంపీపీని ఎలా అవమానిస్తారని నిలదీశారు. హుజురాబాద్‌లో ఈటల గెలుపు ఖాయమన్న కోపంతోనే ఇటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిజంగా సీఎం కేసీఆర్‌కు మహిళలు అంటే గౌరవం ఉంటే మంత్రి ఎర్రబెల్లిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బొడిగె శోభ డిమాండ్ చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దళిత ద్రోహి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చల్ల ధర్మారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్ విసిరారు బొడిగె శోభ.