‘రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి.. కేబినెట్‌లో దొంగలు’

దిశ, జమ్మికుంట: ఉద్యమకారులపై రాళ్లతో దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మానుకోట యుద్ధంలో కౌశిక్ రెడ్డి చేతిలో చాలా మందిమి రాళ్ల దెబ్బలు తిన్నామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని వారం గడవకముందే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే ఎందుకు ఎమ్మెల్సీ […]

Update: 2021-08-02 06:38 GMT

దిశ, జమ్మికుంట: ఉద్యమకారులపై రాళ్లతో దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మానుకోట యుద్ధంలో కౌశిక్ రెడ్డి చేతిలో చాలా మందిమి రాళ్ల దెబ్బలు తిన్నామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని వారం గడవకముందే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. దొంగలకు కేబినెన్‌లో చోటు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చినా.. హుజురాబాద్‌లో గెలిచేది మాత్రం ఈటల రాజేందర్ మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు.

Tags:    

Similar News