సింగరేణిలో పాగా కోసం బీఎంఎస్ వ్యూహాలు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బీజేపీ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) కార్మిక సంఘాన్ని బలోపేతం చేసేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. టీజీబీకేఎస్‌కు రాజీనామా చేసి బీఎంఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు కెంగర్ల మల్లయ్య వ్యూహాత్మక చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే గుర్తింపు కార్మిక సంఘాల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో సింగరేణిలో గెలుపు కోసం ఆయా కార్మిక సంఘాలు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నాయి. దానిలో భాగంగా కెంగర్ల మల్లయ్య టీఆర్ఎస్ అనుబంధ కార్మిక […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బీజేపీ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) కార్మిక సంఘాన్ని బలోపేతం చేసేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. టీజీబీకేఎస్‌కు రాజీనామా చేసి బీఎంఎస్‌లో చేరిన సీనియర్ నాయకుడు కెంగర్ల మల్లయ్య వ్యూహాత్మక చర్యలు మొదలు పెట్టారు. ఇప్పటికే గుర్తింపు కార్మిక సంఘాల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో సింగరేణిలో గెలుపు కోసం ఆయా కార్మిక సంఘాలు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నాయి. దానిలో భాగంగా కెంగర్ల మల్లయ్య టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి గుడ్‌బై చెప్పి బీఎంఎస్‌కు తీర్థం పుచ్చుకోవడంతో బీఎంఎస్‌ను సింగరేణిలో పటిష్టం చేసేందుకు అధిష్టానం మల్లయ్యకు సంపూర్ణ బాధితులను కట్టబెట్టింది. ఇప్పటికే మల్లయ్య ఏరియా వైజ్‌గా వివిధ యూనిట్లలో పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులను బీఎంఎస్‌లోకి లాగి కీలకమైన పదవులను కట్టపెడుతున్నారు. ఈ నేపథ్యంలో బీఎంఎస్ నాయకుడు కాంపల్లి సమ్మయ్య కీలక నాయకుడిగా కొనసాగుతూ మందమర్రి ఏరియాలో భారీ ఎత్తున వివిధ సంఘాల నుంచి బీఎంఎస్‌లో చేర్పించారు. ఈ చేరికలను బీఎంఎస్ నేత మల్లయ్య స్వయంగా హాజరై వివిధ కార్మిక సంఘాల నాయకులను యూనియన్‌లోకి కండువా కప్పి ఆహ్వానించారు. బీఎంఎస్‌లో భారీ చేరికల నేపథ్యంలో ఈ దఫా జరగబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎగరవేసేందుకు భారతీయ జనతా పార్టీ కీలక నాయకులు మాజీ ఎంపీ గడ్డం వివేక్‌కు సింగరేణిలో పట్టు ఉండడంతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ పదవులు కట్టబెడుతున్నారు.
యూనియన్లలో వణుకు
బీఎంఎస్‌లో చేరికల నేపథ్యంలో ఇతర యూనియన్ లలో వణుకు మొదలైంది. సింగరేణిలో జరగబోవు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టి బి జి ఎస్ కు ధీటుగా బి ఎంఎస్ యూనియన్ బలోపేతం చేయాలని బిజెపి నాయకులు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ యూనియన్ పగ్గాలను మల్లయ్య కు కట్టబెట్టారు. మల్లయ్య సైతం తనకున్న రాజకీయ పరిజ్ఞానం తో ఆయా ఏరియాలో పర్యటిస్తూ కీలకమైన నేతలను యూనియన్ లోకి ఆహ్వానిస్తూ సంఘ బలోపేతం కోసం శ్రమిస్తున్నారు. ఏది ఏమైనా రాబోవు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బి ఎం ఎస్ యూనియన్ తిరిగి పాగా వేస్తుందనే ప్రచారం గట్టిగా వినిపిస్తున్న ది . దీంతో ఇతర కార్మిక సంఘాల్లో ఆందోళన బయలుదేరింది.