బిగ్ బ్రేకింగ్ : కాబూల్‌లో వరుస పేలుళ్లు..15 మంది అమెరికా సైన్యం మృతి
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు సంభవించింది. హమీద్ కర్జాయ్ విమానాశ్రయం అబే గేట్ దగ్గర ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడి పౌరులు భయంతో పరుగులు తీశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ మరోసారి తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. మొదట కాల్పులు జరిగాయని, ఆ తర్వాత పేలుడు జరిగినట్టు పెంటగాన్ పేర్కొంది. అయితే, ఆఫ్ఘన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అగ్రరాజ్యం ముందస్తుగా హెచ్చరించింది. ఆగస్టు 31 వరకు నాటో దళాలైన అమెరికా, […]
దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు సంభవించింది. హమీద్ కర్జాయ్ విమానాశ్రయం అబే గేట్ దగ్గర ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడి పౌరులు భయంతో పరుగులు తీశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ మరోసారి తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. మొదట కాల్పులు జరిగాయని, ఆ తర్వాత పేలుడు జరిగినట్టు పెంటగాన్ పేర్కొంది. అయితే, ఆఫ్ఘన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అగ్రరాజ్యం ముందస్తుగా హెచ్చరించింది.
ఆగస్టు 31 వరకు నాటో దళాలైన అమెరికా, బ్రిటన్ ఆర్మీ ఆఫ్ఘన్‌ను వీడి వెళ్లాలని తాలిబన్లు డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. వారిని టార్గెట్ చేస్తూ, భయాందోళనకు గురిచేసే ప్రక్రియలో భాగంగానే తాలిబన్లు ఆత్మాహుతి పేలుడును సృష్టించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ పేలుడులో 15 మంది అమెరికన్ ఆర్మీ మృతి చెందగా, కొందరు సాధారణ పౌరులకు గాయలైనట్టు అమెరికా రక్షణ రంగం ప్రకటించింది.