అమెరికా ఆందోళనల వెనుక ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’
వాషింగ్టన్: అమెరికాలో నానాటికీ పెరిగిపోతున్న జాతి వివక్షపై పోరాడటానికి ఆందోళనకారులు రోడ్లపైకి వస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఎరిక్ గార్నర్ జాతి వివక్షకు బలవ్వగా, తాజాగా, జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతితో చనిపోయాడు. ఆనాటి నుంచి నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రోడ్లపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా వ్యాప్తంగా జరిగే ఈ ‘స్ట్రీట్ డెమోన్‌స్ట్రేషన్స్’కు ఒక సంస్థ మద్దతు ఇస్తోంది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే పేరుతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ మానవ హక్కుల ఉద్యమంలో […]
వాషింగ్టన్: అమెరికాలో నానాటికీ పెరిగిపోతున్న జాతి వివక్షపై పోరాడటానికి ఆందోళనకారులు రోడ్లపైకి వస్తున్నారు. ఆరేళ్ల క్రితం ఎరిక్ గార్నర్ జాతి వివక్షకు బలవ్వగా, తాజాగా, జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతితో చనిపోయాడు. ఆనాటి నుంచి నల్లజాతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రోడ్లపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా వ్యాప్తంగా జరిగే ఈ ‘స్ట్రీట్ డెమోన్‌స్ట్రేషన్స్’కు ఒక సంస్థ మద్దతు ఇస్తోంది. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అనే పేరుతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉంది. అలీసా, పాట్రిస్, ఓపల్ అనే ముగ్గురు ఈ సంస్థను స్థాపించారు. ఆఫ్రికన్-అమెరికన్ల పట్ల జాతివివక్ష, మానవహక్కుల ఉల్లంఘన తదితర అన్యాయాలు జరిగినప్పుడు జరిగే ఆందోళనల్లో జైలు పాలయ్యే వారికి ఈ సంస్థ ఆర్థికంగా సాయం చేస్తున్నది. అరెస్టయిన ఆందోళనకారులకు బెయిల్ ఇప్పించడం, వారి జీవనానికి అవసరమైన ఉద్యోగాలు వెతికివ్వడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. 2013 నుంచే ఈ సంస్థ పలు ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉంది. కానీ ఇప్పుడు ‘ఐ కాంట్ బ్రీత్’ ఉద్యమంతో మరోసారి తెరపైకి వచ్చింది. ఎంతో మంది సెలెబ్రిటీలు, క్రీడాకారులు ఈ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’కు తమ మద్దతును తెలిపారు.
ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్న మిన్నెసోటలోనే 20 మిలియన్ డాలర్లను ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’కు సేకరించారు. ఈ విరాళాలను సేకరించడానికి 16 సంస్థలు సహాయం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ విరాళాలన్నింటినీ అరెస్టయిన ఆందోళనకారులను విడిపించడానికి ఉపయోగిస్తామని సంస్థ తెలిపింది. ప్రముఖ ర్యాపర్ డ్రెక్ ఈ సంస్థకు 1 లక్ష డాలర్లను విరాళంగా ఇచ్చాడు. ఆ విషయాన్ని అతను స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. ఇక క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఈ సంస్థకు తన మద్దతు ప్రకటించాడు. రాబోయే రోజుల్లో మరిన్ని విరాళాలు అవసరం అవుతాయనీ, మరింత మంది సెలెబ్రిటీలు ఈ సంస్థకు విరాళాలు అందించాలని కోరుతున్నారు.