ఏపీలో వినాయకచవితి ఉత్సవాలపై రగడ.. బీజేపీ నిరసన

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వినాయకచవితి ఉత్సవాలపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ, టీడీపీ పార్టీలు రోడ్డెక్కి నిరసన గళం విప్పుతున్నాయి. సీఎం జగన్‌ హిందూ వ్యతిరేకి అంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ అయితే ఏకంగా గవర్నర్ బీబీ హరిచందన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి […]

Update: 2021-09-08 02:40 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వినాయకచవితి ఉత్సవాలపై అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ, టీడీపీ పార్టీలు రోడ్డెక్కి నిరసన గళం విప్పుతున్నాయి. సీఎం జగన్‌ హిందూ వ్యతిరేకి అంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ అయితే ఏకంగా గవర్నర్ బీబీ హరిచందన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని, కొవిడ్ పేరుతో చలువ పందిళ్లకు అనుమతి నిరాకరణపై మంగళగిరిలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. మంగళగిరి టౌన్‌లోని సీతారామ కోవెల నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూష, ఆకురాతి నాగేద్రం ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. శాంతి యుతంగా చేస్తున్న ర్యాలీకి పోలీసులు అడ్డుచెప్పడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు.

 

Tags:    

Similar News