వైసీపీ కీలక నిర్ణయం.. వివిధ జిల్లాలకు అధ్యక్షుల నియామకం

వైసీపీ అధినేత జగన్ ఆయా జిల్లాల అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Update: 2024-09-25 15:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అధికార వైసీపీ పార్టీ కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటుంది. తాజాగా తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని..గత వైపీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన నేతలు వెంటనే.. కౌంటర్ ఎటాక్ లు ప్రారంభించారు. తిరుమల తిరుపతిని కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ ఆయా జిల్లాల అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని వెంకట్రామయ్య(నాని), ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్, అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్ ను నియమిస్తూ.. తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా శంకర్ రెడ్డి, గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నియమించారు.


Similar News