‘స్వచ్ఛ బాలీవుడ్ ఉద్యమం చేద్దాం’

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు పై సీబీఐ దర్యాప్తు చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు ట్విట్టర్‌లో గుర్తు చేశారు. ఇదే కేసులో మనీలాండరింగ్ పై ఈడీ దర్యాప్తు చేస్తోందన్నారు. అంతేకాకుండా.. ఎన్‌డిపిఎస్ చట్టం కింద డ్రగ్ వాడకం కేసును ఎన్‌సిబి విచారిస్తోందన్నారు. ఇంకా,. న్ఐఏ కూడా ఇదే వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతుందేమో అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒకే కేసులో ప్రభుత్వ వ్యవస్థలు విచారిస్తున్నాయని.. దేశమంతా సుశాంత్ సింగ్ […]

Update: 2020-08-27 07:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు పై సీబీఐ దర్యాప్తు చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు ట్విట్టర్‌లో గుర్తు చేశారు. ఇదే కేసులో మనీలాండరింగ్ పై ఈడీ దర్యాప్తు చేస్తోందన్నారు. అంతేకాకుండా.. ఎన్‌డిపిఎస్ చట్టం కింద డ్రగ్ వాడకం కేసును ఎన్‌సిబి విచారిస్తోందన్నారు.

ఇంకా,. న్ఐఏ కూడా ఇదే వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతుందేమో అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఒకే కేసులో ప్రభుత్వ వ్యవస్థలు విచారిస్తున్నాయని.. దేశమంతా సుశాంత్ సింగ్ కేసు పురోగతి కోసం ఆసక్తికరంగా చూస్తోందన్నారు.

కేవలం సుశాంత్ సింగ్ కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛ బాలీవుడ్ కోసం ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే కంగనా రనౌత్ అండ్ టీమ్ సూశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం పోరాడుతున్నారని.. స్వచ్ఛ బాలీవుడ్ కోసం కూడా ఉద్యమం చేయాలన్నారు. స్వచ్ఛ భారత్-స్వచ్ఛ బాలీవుడ్ అంటూ మురళీధర్ రావు ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.

Tags:    

Similar News