"ఇక చాలు.. ఈ తిట్ల తుఫాన్ ను ఆపి.. ఆ గులాబ్ తుఫాన్ పై ఫోకస్ పెట్టండి "
దిశ, ఏపీ బ్యూరో: రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. మంత్రులు పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్‌కు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ సైతం వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ విమర్శలు.. ప్రతి విమర్శలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘జనసేన అధ్యక్షుడు […]
దిశ, ఏపీ బ్యూరో: రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. మంత్రులు పవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్‌కు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ సైతం వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ విమర్శలు.. ప్రతి విమర్శలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ట్విటర్ వేదికగా స్పందించారు.
‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండించారు. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలని హితవు పలికారు. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకమని చెప్పుకొచ్చారు. తిట్ల తుఫాన్ కు తెరదించి గులాబ్ తుఫాన్ పై వైసీపీ శ్రద్ధ పెట్టాలి అంటూ జీవీఎల్ అధికార పార్టీ నేతలకు చురకలంటించారు.