పేదల గుడిసెలను తొలిగిస్తారా.. టీఆర్ఎస్‌పై బీజేపీనాయకులు ఫైర్

దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి సర్వే నెంబర్ 37లో ఉన్న గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించిన నేపథ్యంలో బీజేపీ నాయకులు బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామల రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వమే నేరుగా రియలేస్టేట్ వ్యాపారం చేస్తోందని, వరుస ఓటములతో ఇక రాష్ట్రంలో తిరిగిరామనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ స్థలాల్లో ఉన్న పేదల గుడిసెలను ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. వీరంతా 30 ఏళ్ల నుంచి […]

Update: 2021-12-09 00:56 GMT

దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి సర్వే నెంబర్ 37లో ఉన్న గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించిన నేపథ్యంలో బీజేపీ నాయకులు బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామల రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వమే నేరుగా రియలేస్టేట్ వ్యాపారం చేస్తోందని, వరుస ఓటములతో ఇక రాష్ట్రంలో తిరిగిరామనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ స్థలాల్లో ఉన్న పేదల గుడిసెలను ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు.

వీరంతా 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారని, వారికి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ ఉన్నా వారికి డబుల్ బెడ్రూం కేటాయించలేదని మండిపడ్డారు. చంటిపిల్లలు, వికాలంగులని అని కూడా చూడకుండా పోలీసులతో దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూంస్ కేటాయించే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదన్నారు సామ రంగారెడ్డి. బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్, గజ్జల యోగానంద్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్న నిరుపేదలకు ఇప్పటి వరకు ఇళ్లు కేటాయించని అధికార పార్టీ నాయకులు, ఉన్న పళంగా ఇప్పుడు దాడులు చేసి ఖాళీ చేయించడం దారుణమని అన్నారు. గతంలో 58 జీవోకు అప్లై చేసుకున్నా రెగ్యులరైజ్ చేయలేదని, ప్రస్తుతం 5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులకు డబుల్ బెడ్రూంలు కేటాయించాలని, ఆస్తినష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బేజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News