కరీంనగర్‌లో భగ్గుమన్న ‘గులాబీ’ పంచాయితీ..
దిశ, కరీంనగర్ సిటీ : గ్రామంలోని ప్రజలందరూ ఉపయోగించుకునే కార్యాలయానికి గులాబీ రంగువేసి అధికార దర్పం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఆ గ్రామ పంచాయతీ ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ రూరల్ మండలంలోని తహెర్ కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన నూతన పంచాయతీ భవనానికి గులాబీ రంగు వేశారు. నిబంధన ప్రకారం తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీ జెండా రంగు వేయడాన్ని ఖండిస్తూ, బీజేపీ కార్యకర్తలు జీపీ […]
దిశ, కరీంనగర్ సిటీ : గ్రామంలోని ప్రజలందరూ ఉపయోగించుకునే కార్యాలయానికి గులాబీ రంగువేసి అధికార దర్పం ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఆ గ్రామ పంచాయతీ ఎదుట బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ రూరల్ మండలంలోని తహెర్ కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన నూతన పంచాయతీ భవనానికి గులాబీ రంగు వేశారు. నిబంధన ప్రకారం తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉండగా.. ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీ జెండా రంగు వేయడాన్ని ఖండిస్తూ, బీజేపీ కార్యకర్తలు జీపీ ఆఫీసు ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు, పంచాయతీ భవనాలకు, వైకుంఠ దామాలకు, ప్రకృతి వనాలకు, కరెంట్ స్తంబాలను కూడా వదలకుండా గులాబీ రంగు వేయటం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ, ప్రజా కార్యాలయాలకు పార్టీల జెండా రంగును వేయకూడదని హైకోర్టు ఉత్తర్వులున్నా.. వాటిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. అధికారులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను పలుమార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు వెంటనే తొలగించాలని, లేకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమణారెడ్డి, తిరుపతి, గోపాల్, నరేష్, శ్రీనివాస్, శంకరయ్య, రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.