కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కులేదు.. సైదాబాద్‌లో విజయశాంతి ఆగ్రహం

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని బీజేపీ కీలక నేత, సినీ నటి విజయశాంతి గురువారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, మహిళలు, యువతులు బయట తిరిగే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో సంచలన ఘటన జరిగినా, ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని, అసలు కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి […]

Update: 2021-09-16 04:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని బీజేపీ కీలక నేత, సినీ నటి విజయశాంతి గురువారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, మహిళలు, యువతులు బయట తిరిగే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో సంచలన ఘటన జరిగినా, ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని, అసలు కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఉదయం ఆరు గంటలకు మంత్రులు వచ్చి డబ్బులు ఇచ్చి నోరు మూసేద్దామనుకోవడం సమంజసం కాదన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ఉద్యమం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని విజయశాంతి ప్రకటించారు. ఇలాంటి ఘటనల్లో నిందితులను శిక్షించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని, వాటిని మార్చాలని, ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Tags:    

Similar News